భాజపా, వైకాపా అధికారంలోకి వచ్చాక పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటాయని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విమర్శించింది. నిత్యం ఇరవై నుంచి 30 పైసల వంతున ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లీటర్ డీజిల్‌పై 40 రూపాయలు లీటర్ పెట్రోల్ పై 50 రూపాయలు వ్యాట్, సెస్‌లను వేసి సామాన్య ప్రజానీకంపై ఆర్థిక భారాలను మోపుతున్నాయని ఆరోపించారు. ఇందుకు నిరసనగా విశాఖ అక్కయ్యపాలెంలో పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ పేరుతో తీసుకువచ్చిన జీఎస్టీ డీజిల్, పెట్రోల్ ధరల మీద ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న వ్యాట్ సెస్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజాప్రతినిధులు ప్రజాగ్రహానికి గురియై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి