రాష్ట్రంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు గృహాలు మంజూరు విజ్ఞప్తులే ఎక్కువగా ఉన్నాయని గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామాచార్యులు పేర్కొన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన గృహనిర్మాణ అధికార్లుతో ఆయన భేటీ అయ్యారు. బిల్లు చెల్లింపు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. ఉగాది తర్వాత గృహాలు మంజూరు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అన్నారు.
ఇదీచూడండి.ఆటోలో వెళ్తుంటే హెల్మెట్ లేదట...