ETV Bharat / state

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నౌకాదళం సిద్ధంగా ఉంది: ద్రౌపది ముర్ము

Navy Day Celebrations: భారత నౌకాదళం రోజురోజుకు బలోపేతమవుతోందని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూ... అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారంటూ నౌకాదళ సిబ్బందిని అభినందించారు. ఆత్మనిర్భర్‌ భారత్ కింద నౌకాదళంలో మౌలిక వసతుల పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. "నేవీ డే" సందర్భంగా విశాఖలో నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి.

Navy day
నేవీ డే
author img

By

Published : Dec 4, 2022, 9:00 PM IST

Updated : Dec 5, 2022, 7:07 AM IST

Navy Day Celebrations: విశాఖలో నౌకాదళ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్​, సభాపతి తమ్మినేని సీతారాం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు అమర్నాథ్, రజిని, నౌకాదళ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ధైర్యసాహసాలను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని... ఈ విభాగం బలోపేతం కావడం మనందరికీ గర్వకారణమన్నారు.

కర్నూలు జిల్లాలో 3వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎన్​ఓఆర్ తోపాటు... ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను రాష్ట్రపతి ప్రారంభించారు. రాయచోటి, అంగళ్లు మధ్య జాతీయ రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారుల విస్తరణ దేశ ప్రగతి సూచికగా రాష్ట్రపతి అభివర్ణించారు. గిరిజన విద్యార్థుల ఉన్నతికి ఏకలవ్య పాఠశాలలు దోహదం చేస్తాయన్నారు. కర్నూలులో చేపడుతున్న ప్రాజెక్టుతో... రక్షణశాఖ పరీక్షా సామర్థ్యం మరింత పెరిగిందని అభినందించారు.

అంతకుముందు... నౌకాదళం నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. క్లిష్ట పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైస్పీడ్ బోట్లతో సముద్రం నుంచి వేగంగా ఒడ్డుకు రావడం, యుద్ధనౌకలో విన్యాసాలు, గగనతలంలో చేతక్ హెలికాప్టర్ల సాహసకృత్యాలు, మిగ్ 29 యుద్ధవిమానాల ప్రదర్శన సహా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేయడం మెప్పించింది. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నౌకాదళ లాంఛనాలతో సూర్యాస్తమయ వేడుకలు నిర్వహించారు. యుద్ధనౌకల నుంచి రంగురంగుల కాంతులతో బాంబులు విసరడం ఆక‌ట్టుకుంది. వివిధరకాల ప్రమాణాలతో నౌకాదళం సిబ్బంది జాతీయ పతాకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శంకర్ ఎహసాన్ లాయ్ బృందం ఆలపించిన నౌకాదళ గీతం వీనుల విందుగా సాగింది.

విశాఖలో నౌకాదళ వేడుకలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 5, 2022, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.