ETV Bharat / state

ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని పెంచాలి: జిల్లా వ్యవసాయ శాఖ - ఖరీఫ్ సాగు వార్తలు

విశాఖ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తోంది. వీటిని రైతు భరోసా కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

kharif cultivation
సాగు సన్నాహాలు
author img

By

Published : May 17, 2021, 10:26 AM IST

వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా.. విశాఖ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గత ఏడాది కురిసిన వర్షాలతో చేపట్టిన సాగు వివరాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది అన్ని పంటలూ కలిపి 1,90,200 హెక్టార్లలో సాగు చేయాలని సన్నాహాలు చేస్తోంది. గడచిన అయిదేళ్లలో సాగు సగటు వివరాలు పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు రచిస్తోంది. గతేడాది 1,75,437 హెక్టార్ల సాగు లక్ష్యంగా నిర్ణయించగా… ఈ ఏడాది అదనంగా మరో 15 వేల హెక్టార్లలో సాగు చేపట్టాలని ప్రతిపాదించింది.

ఇందులో ప్రధానంగా 58శాతం వరి, 17 శాతం చెరకు, పది శాతం రాగులు, ఇతర పంటలు 10 శాతం ఉంటాయని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ మేరకు 38 వేల 544 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 38వేల 85 క్వింటాల వరి, 200 క్వింటాల వేరుశనగ, నువ్వులు 209 క్వింటాలు, చిరుధాన్యాలు 103 క్వింటాలు ఉన్నాయి. ఇవి కాకుండా 3,400 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేశారు. ఇందులో అన్ని రకాల విత్తనాలు పది వేల క్వింటాళ్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. విశాఖ మన్యం రైతులకు అందుబాటులో ఉండేలా ఇప్పటికే ఆయా మండలాలకు వరి విత్తనాలను పంపించారు. మైదాన ప్రాంత రైతులకు సంబంధించి జిల్లా గోదాము నుంచి రైతు భరోసా కేంద్రాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చే ఖరీఫ్​లో అన్ని రకాల పంటలకు అవసరమైన 55 వేల టన్నుల ఎరువులు అందుబాటులో తేవాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇందులో యూరియా 30 వేల టన్నులు, బీఏపీ 8 వేల750 టన్నలు, కాంప్లెక్స్ ఎరువులు ఏడువేల టన్నులు, సూపర్ ఫాస్పేట్ 4 వేల 500 టన్నుల చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను సరఫరా కానున్నాయి. ప్రతీ కేంద్రంలోనూ కనీసం అయిదు టన్నుల ఎరువులు నిల్వ ఉంచాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది.

ఇదీ చదవండి:

తౌక్టే ఎఫెక్ట్: రాష్ట్రంలో వర్షాలు.. అన్నదాతలకు నష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.