ETV Bharat / state

'సన్మానించే కార్యక్రమానికే సకాలంలో రాకపోతే.. ఇక మీ వార్డుల్లో ఏం సేవలు అందిస్తారు' - yelamanchili municipality news

విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. మిమ్మల్ని సన్మానించే కార్యక్రమానికే మీరు సకాలంలో రాకపోతే.. ఇక వార్డుల్లో ఏం సేవలు అందిస్తారు అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ పాటించని వాలంటీర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణికి ఎమ్మెల్యే కన్నబాబు సూచించారు.

Volunteers Awards present program
వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమంలో రసాభాస
author img

By

Published : Apr 12, 2022, 7:30 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు(కన్నబాబు రాజ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో కన్నబాబు మండిపడ్డారు. వాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కార్యక్రమానికి డుమ్మా కొట్టినా, ఆలస్యంగా హాజరైన 50 మంది వాలంటీర్లను వెంటనే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణికి సూచించారు. వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఈనెల 26కి వాయిదా వేశారు.

స్థానిక వాసవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు నిర్ణీత సమయానికి వైకాపా నాయకులతో కలిసి కన్నబాబు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ పరిధిలోని వాలెంటర్లు, వార్డు సచివాలయం సిబ్బందిలో సగం మంది కూడా హాజరు కాలేదు. వచ్చిన వాళ్లలో కొందరు ఆలస్యంగా రావడం, మరికొందరూ ఫోన్లల్లో కబుర్లు చెప్పుకోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని సన్మానించే కార్యక్రమానికి మీరే సకాలంలో రాకపోతే.. ఇక మీరు వార్డుల్లో ప్రజలకు ఏం సేవలు అందిస్తారని ప్రశ్నించారు. మీ క్రమశిక్షణా పనితీరు అక్కడే అర్థమవుతుందన్నారు. ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే మిమ్మళ్లి క్షమించేది లేదని హెచ్చరించారు.

సరైన కారణం లేకుండా కార్యక్రమానికి హాజరుకాని వారందరినీ సస్పెండ్ చేయాలని మున్సిపల్​ కమిషన్​ కృష్ణవేణికి సూచించారు. వారికి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించి పంపించాలని సూచించారు. వాలంటీర్లలో కనీసం క్రమశిక్షణ కనిపించలేదని.. సచివాలయం సిబ్బంది కూడా అలాగే ఉన్నారని కన్నబాబు మండిపడ్డారు. వెంటనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ.. వేదికపై నుంచి వెళ్లిపోయారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ఎక్కడ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే వాలంటీర్లు చూడలేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని 26కు వాయిదా వేశారు. వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఇలా వాయిదా వేయడం ఇదే తొలిసారి కావడంతో జిల్లాలో ఇది చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: తాజా మాజీల తొలి రోజు ఎలా ఉందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.