విశాఖ మన్యం పెదబయలు మండలం బొంగరం పంచాయతీ చిట్రకాయిపుట్టులో రెండు రోజుల కిందట ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు రంగారావు అనే యువకుడిని హతమార్చారు. దీనికి నిరసనగా విశాఖ ఏజెన్సీ పాడేరు, జి.మాడుగుల, పెదబయలు మండలాల ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న గోడలకు మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. 'మావోయిస్టు రక్త దాహానికి మరో యువకుడు బలి, మావోయిస్టులు ఇంత దిగజారి పోతారా' అని పోస్టర్లలో విమర్శించారు. కొర్రా రంగారావు బంధువుల పేరిట ఈ పోస్టర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆడియో టేపు: మవోయిస్టులపై విషప్రచారం తగదు