ETV Bharat / state

తుపాకీ పక్కన పెట్టి.. చాక్​పీస్ చేత పట్టి - latest news of vishaka

పోలీసులు పాఠాలు చెప్పడమేంటనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. విశాఖ మన్యంలో పోలీసులు.. పిల్లలకు చదువు ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. స్వయంగా చాక్​పీస్ చేత పట్టి పాఠాలు చెబుతున్నారు. కొవిడ్ తర్వాత కొంత మంది పిల్లలు బడికి రావడం లేదని.. వారికి, తల్లిదండ్రులను అవగాహన కల్పించేందుకు తాము పాఠాలు బోధించామని పోలీసులు చెబుతున్నారు.

police as teacher
police as teacher
author img

By

Published : Sep 2, 2021, 1:44 PM IST

విశాఖ మన్యంలో ఒడిశా స‌రిహ‌ద్దు మారుమూల గ్రామాలను పోలీసులు సందర్శించి పాఠ‌శాల‌ల‌కు విద్యార్తులు వెళ్లే విధంగా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా తుపాకీని ప‌క్క‌న‌బెట్టి విద్యార్థుల‌కు పాఠాలు చెబుతున్నారు. పోలీసు ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల మేర‌కు సీలేరు ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు విశాఖ మ‌న్యంలో ఒడిశా
స‌రిహ‌ద్దుకు ఆనుకుని ఉన్న గ్రామాలను సందర్శిస్తున్నాయి. క‌రోనా కార‌ణంగా గత కొంత కాలంగా చదువుకు దూరమైన చిన్నారులతో కాసేపు గడిపి.. వారికి పాఠాలు బోధిస్తున్నారు. ఒక వైపు వర్షాలు పడుతున్నా... గ్రామాల్లో పోలీసులు పర్యటిస్తూ విద్యార్థులకు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ పాఠాలు చెబుతున్నారు.

గ్రామాల్లోని యువత ముందుకొచ్చి రోజుకో గంట పాటు చిన్నారులకు చదువు చెప్పాలని ఎస్సై సూచించారు. పలు గిరిజన గ్రామాల్లో సందర్శించి వారికి అవగాహన కల్పించారు. కొన్ని సమస్యలు ఉన్నాయని స్థానికులు చెప్పగా.. సానుకూలంగా స్పందించిన ఎస్సై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం సీజనల్​ వ్యాధులకు సంబంధించి గిరిజనులకు అవ‌స‌ర‌మైన మందులు అందజేసి వాటిని ఎలా ఉప‌యోగించాలో వివరించారు.

ఇదీ చదవండి: fire accident near jntu: జేఎన్‌టీయూ సమీపంలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.