Anganwadi chalo collectorate: విశాఖ జిల్లాలో తలపెట్టిన 'చలో కలెక్టరేట్' కార్యక్రమానికి తరలివెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను.. పోలీసులు అడ్డుకున్నారు. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట మండలాల నుంచి.. తెల్లవారుజామున 4 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలు చాలామంది పాడేరు చేరుకున్నారు. అక్కడినుంచి ప్రైవేట్ వాహనాలల్లో విశాఖ బయల్దేరారు. అయితే చెక్ పోస్టుల వద్దే పోలీసులు తమని ఆపేసి.. వెనక్కి పంపిస్తున్నారని వారు ఆరోపించారు. తమ సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడతామని కార్యకర్తలు హెచ్చరించారు.
పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట
కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌తో.. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన పోలీసుల అడ్డగింపుతో ఉద్రిక్తతలకు దారితీసింది. విశాఖ సరస్వతి పార్క్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా.. పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తల మధ్య తోపులాట జరగగా.. ఓ అంగన్వాడీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన అంగన్వాడీలు.. నిరసన విరమించారు.
ఇదీ చదవండి: NSTL women scientists: ఎన్ఎస్టీఎల్ మహిళా శాస్త్రవేతలతో ఈటీవీ భారత్ ముఖాముఖి