ETV Bharat / state

గాలికొండలో సామాజిక పోలీసింగ్.. అభివృద్ధికి నాంది​..! - maoist effectd villages development by police

విశాఖ జిల్లాలోని మన్యంలో మావోల వల్ల గిరిపుత్రులు అభివృద్ధికి దూరమౌతున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారి అభ్యున్నతికి కావలసిన కార్యాచరణతో తాము ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. వారి వినతులు స్వీకరించి.. సాయం అందిస్తామని అంటున్నారు. వివిధ సౌకర్యాలను అందిస్తూ వారిని ప్రగతి వైపు నడిపించేలా.. వివిధ పథకాలతో సాయం అందిస్తున్నారు.

community policing in visakapatnam district
మావోల కంచుకోట గాలికొండలో సామాజిక పోలీసింగ్
author img

By

Published : May 1, 2021, 6:07 PM IST

మావోల కంచుకోట గాలికొండలో సామాజిక పోలీసింగ్...

మావోయిస్టులు కంచుకోట గాలికొండ పంచాయ‌తీలో పోలీసులు సామాజిక పోలీసింగ్​ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించారు. విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలు మేర‌కు విశాఖ మ‌న్యంలోని గూడెం కొత్త‌వీధి మండ‌లం మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతమైన గాలికొండ పంచాయ‌తీ గ‌డ్డిబందలో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అద‌న‌పు ఎస్పీ (ఆప‌రేష‌న్స్‌) స‌తీష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ మ‌న్యంలో గిరిజ‌న గ్రామాలు అభివృద్ధే ల‌క్ష్యంగా పోలీసుశాఖ ప‌నిచేస్తుంద‌ని, త‌మ సిబ్బంది గ్రామ సంద‌ర్శ‌నలో వెల్లువెత్తిన విన‌తుల మేర‌కు తాము చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయన హామీ ఇచ్చారు.

గిరిపుత్రుల వెనకుబాటుకు మావోలే కారణం..

గాలికొండ ర‌హ‌దారి నిర్మాణం 20 సంవ‌త్స‌రాలు సాగిందంటే కేవ‌లం మావోయిస్టుల వ‌ల్ల‌నేన‌ని, మావోయిస్టులు మారుమూల ప్రాంతాల‌కు అభివృద్ధికి నిరోధ‌కులుగా మారార‌ని అభిప్రాయపడ్డారు. కానీ... ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నందున.. పోలీసు శాఖ దృష్టి పెట్టి త్వరితగతిన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు తెలిపారు. గాలికొండ మీదుగా పుట్ట‌కోట‌కు కూడా ర‌హ‌దారి నిర్మించ‌డానికి నిధులు మంజూర‌య్యాయని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల‌కు ర‌హ‌దారులు నిర్మించ‌డమేకాక.. సెల్ ట‌వ‌ర్ల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగ‌ర‌నాయుడు మాట్లాడుతూ... గాలికొండ అన‌గానే చాలామందికి మావోయిస్టు గాలికొండ ద‌ళం గుర్తుకు వ‌స్తుంద‌ని.. అటువంటి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధికి నిద‌ర్శ‌నంగా మార్చ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. మావోయిస్టుల మాట‌లు నమ్మి మోస‌పోవ‌ద్ద‌ని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గిరిర‌క్ష‌క మిత్ర ద్వారా యంత్రాల పంపిణీ..

గాలికొండ పంచాయ‌తీ వాసులు కోరిక మేర‌కు గిరిజ‌నులు పండించే ప‌సుపుకు గిట్టుబాటు ధ‌ర ల‌భించే విధంగా.. గిరిర‌క్ష‌క మిత్ర ద్వారా రూ. 2 ల‌క్ష‌లు విలువ చేసే ప‌సుపు బాయిల‌ర్ యంత్రాన్ని గిరిజ‌నుల‌కు అందచేశారు. పిండిమిల్లును కూడా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంక‌టేశ్వ‌ర్ అందించారు.

వాలీబాల్ విజేత‌ల‌కు బ‌హుమ‌తి ప్ర‌ధానం..

గ‌డ్డిబంద‌లో పోలీసులు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా వాలీబాల్ టోర్న‌మెంటులో మొద‌టి స్థానం సాధించిన గాలికొండ జ‌ట్టుకు రూ. 20 వేలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.10 వేలు, తృతీయ‌స్థానం సాధించిన వారికి రూ. 5 వేలు న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన వైద్య‌శిబిరంలో పెద్ద ఎత్త‌న రోగుల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. సుమారు 1500 మంది రోగుల‌కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఉచితంగా మందులు పంపిణీచేశారు.

ఇవీ చదవండి:

అనకాపల్లిలో నకిలీ లాయర్ అరెస్ట్

పెళ్లైన మూడు రోజులకే కరోనాతో వరుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.