ఇటీవల తప్పిపోయిన బాలుడి ఆచూకీ విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఏ.కోడూరు పోలీసులకు లభ్యమైంది. పిల్లాడిని సురక్షితంగా వారి బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది
అనకాపల్లి మండలం సత్యనారాయణపురానికి చెందిన 11 ఏళ్ల బాలుడు ఈనెల 26న తప్పిపోయాడు. అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి.. ఇంటి నుంచి బయలుదేరిన బాలుడు.. బంధువుల ఇళ్లు చేరలేదు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆచూకీ కనుగొనే క్రమంలో వాహనాల తనిఖీ చేపట్టగా.. బాలుడు దొరికాడు. పిల్లాడి బంధువులకు సమాచారం అందించి.. వారికి అప్పగించినట్లు ఎ.కోడూరు ఎస్సై అప్పలనాయుడు చెప్పారు.
ఇదీ చదవండి: ఇదేమి చోద్యం... బియ్యం బండిలో ప్రయాణికుల రవాణా !