విశాఖ మన్యంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగడానికి పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ముంచంగిపుట్టు పరిధిలో ఎన్నికల అవాంతరాలు రాకుండా డ్రోన్ల సహాయంతో పహారా కాస్తున్నారు. మండలంలోని రంగబయలు, బంగాపుట్, వణుగుమ్మ, బూసిపుట్టు తదితర మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న పంచాయతీల నామినేషన్లను లక్మీపురం, బరడా పంచాయతీ కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు డ్రోన్ల నిఘా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. పరిస్థితులను ముంచంగిపుట్టు ఎస్సై ప్రసాద్ రావు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంతా రాజీనామా చేయాలి: గంటా