ETV Bharat / state

సందడిగా 'పొలం బడి'.. రైతులకు మెళకువల బోధన

విశాఖ జిల్లాలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పొలం బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు పొలాలకు వెళ్లి రైతులకు మెళకువలు నేర్పుతున్నారు.

polam badi program in vizag district
విశాఖ జిల్లాలో 'పొలం బడి' కార్యక్రమం
author img

By

Published : Oct 12, 2020, 3:36 PM IST

విశాఖ జిల్లాలో వ్యవసాయ శాఖ 'పొలం బడి' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మండల స్థాయి అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 5 నుంచి 10 మంది రైతులను కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేసి వారి పొలంలో పైరును పరిశీలించి మెళకువలు చెప్తున్నారు. తక్కువ ఎరువులు వాడడం, తెగుళ్లు నివారించే మందులు సూచించడం వంటివి చేస్తున్నారు. ఈ చర్యల వల్ల రైతుకు పెట్టుబడి తగ్గి మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.

14 వారాలు పాటు పంటను పరిశీలిస్తామని చెప్పారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, పెందుర్తి మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పొలంబడి కార్యక్రమంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తమకెంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. అధికారులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో... పంటకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకున్నామని తెలిపారు.

ఇవీ దదవండి:

అనంతపురం కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.