విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం జీసీసీ డిపో నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండటాన్ని వారు గుర్తించారు. పంపిణీ అనంతరం ఇంటికి తీసుకెళ్లి వండుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బియ్యం శుభ్రం చేస్తుండగా ప్లాస్టిక్ బియ్యం కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఇవి విరపడానికి ప్రయత్నిస్తే విరగలేదని, నీటిలో నాన బెడితే సాగుతున్నాయని పలువురు ఆరోపించారు.
ఈ విషయమై... జీసీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి లోకుల గాంధీ తన బృందంతో గ్రామానికి స్థానికులతో మాట్లాడారు. భాధ్యులపై కఠిన చర్యులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ తిరుమలరావుని ఫోనులో సంప్రదించగా అంగన్‌వాడీ ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవి కొంచెం తేడాగా ఉంటున్నాయని చెప్పారు.
ఇదీ చదవండి:
STEEL PLANT: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు.. పెరుగుతున్న ఆందోళనలు