విశాఖ జిల్లా ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో భూసేకరణకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం గ్రామసభలు నిర్వహించకుండా తమ భూమిని అధికారులు లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఇవేమీ తమకు పట్టనట్టు ప్రభుత్వ ఆదేశాలు ప్రకారమే పనులు నిర్వహిస్తున్నామంటూ ముందుకు సాగుతున్నారు.
గ్రామంలో 21 సర్వేనెంబర్లో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో గత 35 సంవత్సరాల నుంచి స్థానిక రైతులు పండ్ల తోటలు వేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ భూమిని ప్రభుత్వం లాక్కుంటే తమ జీవనోపాధి ఎలా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులను ఆపాలని తాము కోరుతుంటే.... తహసీల్దార్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని రైతులు వాపోతున్నారు.