విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలు రేషన్ దుకాణాల వద్ద సర్వర్లు మొరాయించాయి. మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లోని పలు రేషన్ దుకాణాల వద్ద ఈ-పాస్ సర్వర్లు సక్రమంగా పనిచేయలేదు. దేవరాపల్లి మండలంలోని పలు రేషన్ దుకాణాల ముందు కార్డుదారులు బారులు తీరారు.ప్రస్తుతం కొత్త నిబంధనలు ప్రకారం ఎన్ని రకాల సరకులు తీసుకుంటే... అన్ని మార్లు వేలిముద్రలు వేయడంతో ఎక్కువ సమయం పడుతుందని డీలర్లు అంటున్నారు. అసలే దసరా పండగ కావడంతో సరుకులు కోసం కార్డుదారులు వరుసలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. పాత పద్ధతిలోనే సరకులు పంపిణీ చేయాలని సీపీఎం నాయకులు వెంకన్న, దేముడునాయుడు, రాజు, నరసింహమూర్తి డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉండబోతోంది: చంద్రబాబు