విశాఖ జిల్లా పాయకరావుపేటలో మీ సేవ కేంద్రాలను కొన్ని రోజులుగా నిర్వాహకులు మూసివేశారు. రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు కుల, ఆదాయ, ఇతర రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలు కావాల్సి ఉండడంతో.. అవస్థలు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందించి మీ సేవ కేంద్రాలు తెరిపి౦చేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చూడండి:
ఆదర్శ పాఠశాలలో ఉన్నత విద్య ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు