విశాఖ ఘటన తీవ్రంగా కలచివేసింది: పవన్ - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
విశాఖ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు రోడ్లపై పడిపోవడం ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన పవన్.... బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనడం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఇదే స్ఫూర్తిని జన సైనికులు కనబరచాలని పిలుపునిచ్చారు.