ETV Bharat / state

'వ్యూహం లేకుండా గెలిచేద్దామంటే కుదరదు - సమన్వయంతో పని చేస్తేనే అధికారంలోకి వస్తాం: పవన్ - Pawan Kalyan news

Pawan Kalyan Meet with Janasena Party Leaders: టీడీపీతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు చెప్పారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

pawan_kalyan_meet_with_party_leaders
pawan_kalyan_meet_with_party_leaders
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 1:59 PM IST

Pawan Kalyan Meet with Janasena Party Leaders: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నాయకులు, పాలకుల వేధింపులతో ఇబ్బంది పడని వర్గమంటూ ఏదీ లేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి యువతకు, మహిళలకు భరోసా లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీని సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ సూచించారు.

Pawan, Manohar Meet with Party Leaders: విశాఖలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ జిల్లా నాయకులు, పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజకవర్గ బాధ్యులు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో పార్టీ పొత్తు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల పక్షాన చేయాల్సిన పోరాటాలపై పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.

అధికారం కోసం కాదు - మార్పు కోసం ఓట్లు కావాలి: పవన్​ కల్యాణ్​

Pawan Kalyan Comments: పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ..''టీడీపీని సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పని చేయాల్సిన సమయం పార్టీ కార్యకర్తలకు ఆసన్నమైంది. అందరూ కలిసికట్టుగా పని చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు అధికారంలోకి వస్తాయి. వైసీపీ నాయకులు, పాలకుల వేధింపులతో రాష్ట్రంలో ఇబ్బంది పడని వర్గమంటూ ఏదీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. యువతకు, మహిళలకు భరోసా లేకుండా పోయింది. వైసీపీ పాలనలోని లోపాలను ఎండగడుతూ, ప్రజాపక్షాన మనం చేసిన పోరాటాలు, కష్టంలో ఉన్నప్పుడు స్పందించిన విధానాలే మనల్ని నిలబెడుతాయి. కాబట్టి పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలి'' అని ఆయన అన్నారు.

ఉమ్మడి ఎజెండాతో ప్రజల్లోకి - 9న టీడీపీ, జనసేన సంయుక్త సమావేశం

Pawan Kalyan on Party Alliance: రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేనలు తీసుకున్న కీలక నిర్ణయాలకు అందరి మద్దతు ఉందని పవన్‌ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో జనసేన ఓటు శాతం కూడా ఎంతో పెరిగిందని, ఒంటరిగా పోటీ చేస్తే మెరుగైన స్థానాలే దక్కించుకుంటామన్నారు. అయితే, ప్రభుత్వంలోకి రావాలంటే కచ్చితంగా పొత్తు ద్వారానే సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అందుకే టీడీపీతో జట్టు కట్టామని ఆయన వివరించారు. కాబట్టి, పార్టీ శ్రేణులు భాగస్వామ్య పక్షాన్ని గౌరవించి, కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఎన్నికల సమయంలో పకడ్బందీగా వ్యూహాలు అనుసరించకుండా గెలిచేద్దామంటే సాధ్యం కాదని, ఎలక్షనీరింగ్‌పై అందరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాయకులను పవన్ కల్యాణ్ అప్రమత్తం చేశారు.

''ప్రతి నియోజకవర్గం నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటాం. ఈ నెల 12 తర్వాత సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రభావశీలంగా జనంలోకి తీసుకెళ్తాం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం. పార్టీ శ్రేణులు పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిల్లో పనిచేయాలి.''-నాదెండ్ల మనోహర్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌

Pawan meeting With Janasena Representatives: ప్రభుత్వ విధానాల్లోని లోపాలు, వైఫల్యాలపై సమర్థంగా మాట్లాడాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.