విశాఖలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు. యాజమన్యం తీరును ఖండిస్తూ... ముగ్గురు వ్యక్తులు నగరంలో సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.
ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు పట్టించు కోవడం లేదని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ... కొవిడ్ కాలంలో తల్లిదండ్రులపై భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: