విశాఖ మన్యం కేంద్రం పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో మత్స్యగుండం అనే ప్రాంతముంది. ఓవైపు పర్వతాల మీదుగా జాలువారే నీటి సవ్వడులు-చేపల సందడి, మరోవైపు అందమైన ఉద్యానవనంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక్కడ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయమూ ఉంది.
మత్స్యాలు, సర్పాలు ఇక్కడ యుద్ధాలు చేసుకునేవని.. శివుని అనుగ్రహంతో కలసిమెలసి జీవించేవని ఇక్కడి స్థల పురాణం. సెలయేటిలోని చేపలను ఇక్కడ ఎవరూ వేటాడరు. దేవతలుగా కొలుస్తారు. వాటికీ ఆహారమూ అందిస్తారు. కోరుకున్నవి నెరవేరితే మొక్కులూ సమర్పించుకుంటారు.
ఇటీవల సెలయేరు విషపూరితమవటంతో చేపలు మృత్యువాతపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యగుండం ఆలయ పరిసరాలను క్రమక్రమంగా విస్మరించటంతో మరుగున పడిపోయిందని స్థానికులు అంటున్నారు. పర్యాటక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... అలా చేస్తే వారికి కంటి చూపు తిరిగి రావడం ఖాయం!