అనంతపురం జిల్లా గార్లదిన్నె ప్రాంతానికి చెందిన ఓ ఇటుక బట్టీలో వెట్టి చాకిరిలో చిక్కుకున్న ఒడిశావాసులకు ఆపరేషన్ ముస్కాన్ విముక్తిని కలిగించాయి. చిన్నారులతో పని చేయిస్తుండటంతో పోలీసులు ఇటుక బట్టీ యజమానిపై కేసు నమోదు చేశారు. పిల్లల తల్లిదండ్రులను సైతం తక్కువ నగదుతో పని చేయించుకుంటున్నారని తెలిసి వారిని అక్కడినుంచి పంపించే ఏర్పాట్లను చేశారు. వారిని ఇద్దరు పోలీసులతో విశాఖ నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. జీవీఎంసీ ఆధ్వర్యంలోని నిరాశ్రయుల కేంద్రంలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు. బాధితులకు వారి ప్రాంతానికి వెళ్లడానికి దారి ఖర్చులకు అవసరమైన డబ్బులను జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందించింది. గత ఐదు నెలలుగా పిల్లలతో కలిసి ఇటుక బట్టీల్లో కార్మికులుగా చిక్కుకున్నామని బాధితులు వాపోయారు. పోలీసులు, ఇతర విభాగాల అధికారుల చొరవతో తాము అక్కడినుంచి బయటపడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీచూడండి.సమస్యల వలయంలో... మన్యం పాఠశాలలు..!