Ganjai Fire In Visakhapatnam: విశాఖపట్నం రేంజ్ పరిధిలోని జిల్లా పోలీస్ స్టేషన్లో పట్టుబడిన 1,93,384 కేజీల గంజాయి, 133 కేజీల హసిస్ ఆయిల్ని అనకాపల్లి మండలం కోడూరులో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు గంజాయి సాగు వల్ల జరిగే అనర్ధాలు తెలియజేశారు. కళాజాత బృందాలతో అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వ్యవసాయ ఉద్యాన శాఖ ఐటీడీఏతో కలిసి పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత కూరగాయలు వాణిజ్య పంటలు విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయి సాగు విస్తీర్ణాన్ని గుర్తించి దగ్ధం చేసామన్నారు. ఈ ఏడాది ఏజెన్సీ ప్రాంతంలోని ముంచంగి పుట్టు, పెద్దబయలు, జి. మాడుగుల, అన్నవరం, సీలేరు ప్రాంతాల్లోని 650 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు, సెబీ అధికారులు పట్టుకున్నారన్నారు. గంజాయి రవాణాను అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి