ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో తాజాగా మరొకరు మృతి చెందారు. వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచలి కనకరాజు ప్రమాదం జరిగిన అనంతరం రెండు రోజులు చికిత్స పొందారు. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. కనకరాజు వడ్రంగి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. గ్యాస్ లీకేజితోనే కనకరాజు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: శ్రీశైల ఆలయ కుంభకోణం: 24 మంది అరెస్ట్