విశాఖలోని అల్లిపురం యల్లపువారి వీధికి చెందిన ఓ వృద్ధుడికి బుధవారం సాయంత్రం కొవిడ్ నిర్ధరణ అయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతనికి దూరంగా ఉన్నారు. ఆ వృద్ధుడిని గురువారం సాయంత్రం వరకు ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయలేదు. 7 గంటల సమయంలో అతడిని తీసుకెళ్లేందుకు అంబులెన్సు వచ్చింది. వృద్ధుడు అంబులెన్స్ ఎక్కకుండానే తీవ్ర ఆయాసంతో కుప్పకూలాడు. పడిపోయిన వెంటనే శ్వాసకోస సమస్య తీవ్రం కావడంతో ఊపిరి అందక ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన చూపరులను కలచివేసింది.
అంబులెన్స్ ఎక్కే లోపే ప్రాణం విడిచిన కొవిడ్ బాధితుడు - covid deaths
విశాఖలో కొవిడ్ తో ఓ వృద్ధుడు మరణించిన తీరు చూపరులను కలచి వేసింది. కొవిడ్ నిర్ధరణకు ఆసుపత్రికి వెళ్లే లోపే ప్రాణాలు విడిచారు.