విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతం అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్ను ఈ ప్రాంత సామాన్య ప్రజలకు గృహవసతి కల్పించే విధంగా తిరిగి రూపొందించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ కోరారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రహదారులు నిర్మించి.. స్థిరాస్తి వ్యాపారానికి అవకాశం కల్పించే విధంగా ల్యాండ్ పూలింగ్ చేపడతామని మాస్టర్ ప్లాన్లో పేర్కొన్నారని అన్నారు. ఈ విధంగా చేస్తే సామాన్యుల నుంచి భూములు బలవంతంగా తీసుకునే అవకాశం కలుగుతుందని..ఇది సమర్ధనీయం కాదని వ్యాఖ్యానించారు.
సామాన్యులకు గృహ వసతి కల్పించే విధంగా ఏ రకమైన ప్రతిపాదన మాస్టర్ ప్లాన్లో లేదని అన్నారు. దానిపై అభ్యంతరాలు తెలిపేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఇచ్చారని వెల్లడించారు. ఈ సుదీర్ఘ నివేదిక ఆంగ్లంలో ఉందని..దీన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ప్రచురించి, అభ్యంతరాల గడువును పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక కోశాధికారి బీ.బీ గణేష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి.
YS Viveka: 50వ రోజూ సీబీఐ విచారణ.. వివేకా ఇంటిని పరిశీలించిన అధికారులు