విశాఖ మన్యం జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ కూనేటీలో దారుణం జరిగింది. ఈనెల 18న జగ్గారావు అనే నాటువైద్యుడు సేరిబయలుకు చెందిన మర్రి ముసిరి అనే వ్యక్తికి వైద్యం చేయగా.. అది వికటించి అతను మృతిచెందాడు. నాటువైద్యంతోనే ముసిరి చనిపోయాడని అతని బంధువులు జగ్గారావుపై కక్ష పెంచుకున్నారు. దహనసంస్కారాలకు పిలిచి జగ్గారావును ఇటుకతో తలపై మోది హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. మరుసటి రోజు జగ్గారావు కుమారుడు రవి గ్రామపెద్దలతో కలిసి తన తండ్రి మృతదేహాన్ని అప్పగించాలని కోరగా అసలు విషయం బయటపడింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..