విశాఖలో ప్రకృతి అందాల వెనుక, తాగునీటి ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. ఆకాశం నుంచి దిగివచ్చాము..అన్నట్లు కనువిందు చేసే మేఘాల నడుమ ఉండే, గ్రామాలు మంచినీటి కోసం అల్లాడుతున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆంధ్రా కాశ్మీర్ గా పేరొందిన లంబసింగికు ఏడుకిలోమీటర్లు దూరంలో ఉండే చెరువుల వేనంలో తాగేందుకు నీరుండదంటే, ఆశ్చర్యం కలగుక మానదు. గ్రామం పేరులోనే చెరువు ఉంది, ఆ చెరువు నీటి కోసం వెళ్లాలంటే..కి.మీ దూరం వెళ్లాల్సిందే అంటున్నారు,ఈ గిరిపుత్రులు. మా ప్రాంతాలను కాదు..మా కష్టాలనూ చూడండి అని దీనంగా వేడుకుంటున్నారు. కాలంతో పనిలేకుండా ఏడాదిలో 365 రోజులు దాహం తీర్చుకునేందుకు పాట్లు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. తాగునీటి సమస్యను తార్చేందుకు ఐటీడీఏ ప్రయత్నాలు..ప్రయత్నాల స్థాయిలో ఉంటున్నాయి. అవి పూర్తయ్యాయి..అన్న స్థాయికి వచ్చేందుకు ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రహదారైనా వేస్తే, ఇంకొంచం దూరమైన వెళ్తామంటున్న ఈ గిరిపుత్రుల డిమాండ్ లో జాలే కనిపిస్తోంది. .
విశాఖ అందాలనే కాదు..తాగునీటి వ్యధలనూ చూడండి - Visakha Ponds is a beautiful home for tourists
విశాఖలో ప్రకృతి అందాల వెనుక తాగునీటి దాహర్తి ఆర్తనాధాలు ఉన్నాయి. ఆంధ్రా కాశ్మీర్ కు ఏడు కి.మీ దూరంలో ఉండే చెరువుల వేనం గ్రామానికి తాగునీటి సౌకర్యం లేక..ఏళ్లుగా గిరిపుత్రులు అల్లాడుతున్నారు.ఇకనైనా తమ వ్యధను చూసి, తాగు నీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.