ETV Bharat / state

'విశాఖను రాజధాని చేయాలని గతంలోనే కోరాను' - మూడు రాజధానులు

రాజధానిపై నిపుణుల కమిటీ సిఫార్సులను తాను స్వాగతిస్తున్నట్లు ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుని ఆశాభావం వ్యక్తం చేశారు.

MP Subbarami Reddy
సుబ్బరామిరెడ్డి
author img

By

Published : Dec 21, 2019, 10:39 PM IST

విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హెచ్​ఓడీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న జీఎన్​ రావు కమిటీ సిఫార్సులను రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి స్వాగతించారు. ముఖ్యమంత్రి జగన్ ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయిస్తే పాలన ఖర్చు తగ్గుతుందన్నారు. గతంలోనే తాను విశాఖను రాజధానిగా చేయాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్దికి నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన విశాఖకు... రహదారి, రైలు, విమాన, జల మార్గాల ద్వారా రవాణా సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. పరిపాలనా పరంగా విశాఖను కేంద్రంగా చేస్తే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందాలన్న ఈ ప్రాంత వాసుల కోరిక నెరవేరుతుందని సుబ్బరామిరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

'కేంద్రం చూస్తూ ఊరుకోదు.. తగిన సమయంలో చర్యలు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.