విశాఖ జిల్లా మాకవరపాలెంలో గ్రామ దేవత పండగకు అనకాపల్లి ఎంపీ సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ హాజరయ్యారు. గ్రామస్థులు వారికి ఆహ్వానం పలికి.. ఘనంగా సత్కరించారు. గ్రామోత్సవాలు పురాతన సాంప్రదాయాలకు ప్రతీకలని ఎంపీ అన్నారు. వీటి నిర్వహణ ద్వారానే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసిన తితిదే