ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ సత్యవతి - covid care center in visakha patnam latest news

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్యసేవలను ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ రోగుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు.

కొవిడ్ కేర్ సెంటర్​ను తనిఖీ చేసిన ఎంపీ సత్యవతి
ఎంపీ సత్యవతి
author img

By

Published : Apr 25, 2021, 10:47 AM IST

కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.

రోగులకు మెరుగైన సేవలందించేందుకు వైద్య సిబ్బంది కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ ఎంపీని కోరగా.. సిబ్బంది సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. కొవిడ్ సెకండ్ వేవ్​లో ఎలాంటి చికిత్స అందించాలన్నదానిపై వైద్యులకు స్పష్టత ఉందని.. కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆమె భరోసానిచ్చారు.

ఇదీ చదవండి:

కరోనా బాధితులకు ఆయుష్ కాల్ సెంటర్

టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.