విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేఖర్ల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం ఇచ్చిన 35 వేల ఎకరాలను అభివృద్ధి చేయకుండా... 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని... సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. విశాఖలో పరిపాలనా విభాగం, కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. రాజధాని ఒకేచోట ఉంచి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని నాటకం'
చంద్రబాబుపై కక్షతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని నాటకం ఆడుతున్నారని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేఖర్ల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడారు. రాజధాని అమరావతి కోసం ఇచ్చిన 35 వేల ఎకరాలను అభివృద్ధి చేయకుండా... 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని... సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు తీసుకురావాలని సూచించారు. విశాఖలో పరిపాలనా విభాగం, కర్నూలులో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. రాజధాని ఒకేచోట ఉంచి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
చంద్రబాబునాయుడు పై కక్ష్యతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని నాటకం ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు
Body:రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 35 వేల ఎకరాలను శేఖర్ ఇస్తే ఇక్కడ అభివృద్ధి చేయకుండా మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు లక్షకు పైగా విశాఖపట్నం వస్తే తట్టుకునే పరిస్థితులు లేవని వివరించారు
రాజధాని కోసం 35వేల ఎకరాలను సేకరిస్తే అక్కడ అభివృద్ధి చేయకుండా సీఎం జగన్ నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు.
Conclusion:ఉత్తరాంధ్రనుఅభివృద్ధి చేయాలంటే పరిశ్రమను తీసుకు రావాలని అలా కాకుండా విశాఖపట్నంలో పరిపాలనా విభాగం కర్నూలు లో హైకోర్టు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజధాని ఒకేచోట ఉంచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు