స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతామంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను స్వాగతిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ (Minister Avanthi Srinivas on Pawan Kalyan) తెలిపారు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉంటారని కనీసం పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు అయిన ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో అవగాహన ఉండాలని మంత్రి విమర్శించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు గుర్తు చేసిన మంత్రి..దీనిపై ప్రధానికి సీఎం జగన్ 3 లేఖలు రాశారని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ కోసం 64 ఏళ్ల వయస్సులో విజయసాయిరెడ్డి పాదయాత్ర, నిర్వాసితుల సమస్యపై 70 ఏళ్ల గాజువాక ఎమ్మెల్యే పాదయాత్ర చేశారని మంత్రి తెలిపారు. దిల్లీలో చేసిన పోరాటానికి జనసేన, భాజపా రాలేదన్న అవంతి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదనేదే.. తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.