రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత మీడియా ద్వారా గొప్పలు చెప్పుకొంటోందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలపై.. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఘూటుగా స్పందించారు. తమకు సాక్షి మద్దతు మాత్రమే ఉందన్నారు. మిగతా పార్టీలకు ఎన్నో పేపర్లు, ఛానల్స్ ఉన్నట్టు చెప్పారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోని గ్రామంలో రైతులకు ఖరీఫ్ సీజన్ కోసం రాయితీ విత్తనాలు అందజేశారు. భీమునిపట్నం నియోజకవర్గ పరిధిలో ఆనందపురం, పద్మనాభం మండలాల్లో సచివాలయాల ద్వారా విత్తన పంపిణీ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఇవీ చదవండి: