విశాఖ సింహాచలం లక్ష్మీనృసింహస్వామి వారిని... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. లాక్ డౌన్ అనంతరం తొలిసారి స్వామివారి ఆలయానికి ఆయన విచ్చేశారు. ఆలయ అధికారులు మంత్రికి సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ... కరోనా వైరస్‌కు మందు వచ్చేవరకు ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం జీవనంలో భాగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి... శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు