ETV Bharat / state

నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. వదిలిపెట్టేది లేదు: మంత్రి అవంతి

విశాఖపట్నంలో జరిగిన రెండు ఘటనలు చాలా బాధకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ ఘటనల్లో పదిమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జుత్తాడలో ఆరుగురిని చంపిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

minister avanthi srinivas on 6 murders
minister avanthi srinivas on 6 murders
author img

By

Published : Apr 15, 2021, 10:52 PM IST

విశాఖలో నలుగురు సజీవ దహనం, జుత్తాడలో అప్పలరాజు అనే వ్యక్తి ఆరుగురిని చంపేయడం బాధకరమైన ఘటనలని మంత్రి అవంతి అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేతో కలిసి బత్తిన శ్రీనివాస్ కుటుంబాన్ని అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మాట్లాడారు.

లా అండ్ ఆర్డర్ విషయం, ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్​గా తీసుకున్నారని వెల్లడించారు. చిన్నపిల్లలను సైతం చంపడం దారుణమని ఆవేదన చెందారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి చెప్పారు. ఆరుగురి హత్య కేసులో నలుగురి మీద కేసులు పెట్టారన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖలో 6 హత్యల కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.