ముఖ్యమంత్రి జగన్ను కులం, మతం పేరుతో చూడటం సరికాదనేది మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల ఉద్దేశ్యమని మరో మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి కుటుంబం పూర్తిగా దేవుడిపై నమ్మకం కలిగి ఉంటుందన్నారు. తెలుగుదేశం అధినేత దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సంస్కృతి, సంప్రదాయాలు, దేవాలయాలు మన పూర్వీకులు మనకిచ్చిన సంపద అని చెప్పారు. ఏ మతానికి సంబంధించిన ప్రార్థన స్థలాలపై దాడులు జరిగినా తప్పే అవుతుందని అవంతి స్పష్టం చేశారు.
విశాఖలో ప్రపంచ పర్యటక దినోత్సవాలు
ప్రపంచ పర్యటక దినోత్సవాలను విశాఖలో నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర స్థాయి వేడుకలను వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన కొన్ని సందర్శనీయ స్థలాలను పర్యటకంగా ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు అవంతి చెప్పారు.
ఇదీ చదవండి: