విశాఖలో మే 3 వరకు కంటైన్మెంట్ జోన్‌లో లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటల కొనుగోలుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 11,330 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారిలో 22 మందికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయన్నారు. విశాఖకు కొద్దిరోజుల్లో 16 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు వస్తాయని పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో పాల్గొంటున్న పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి..