విశాఖ జిల్లా సబ్బవరంలో వరుణ దేవుని కోసం కప్పలకు పెళ్లి చేసి ఊరేగించారు. సబ్బవరం మండలం గొర్రెల వాని పాలెంలో వర్షాలు పడక పోతే కప్పలకు పెళ్లి చేసి ఊరేగించటం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఏడాది సబ్బవరం మండలంలో వర్షాలు కురవలేదని గ్రామస్థులు కప్పలకు పెళ్లి చేశారు. వాటిని ఉయ్యాలకు కట్టి బ్యాండ్ మేళాలతో ఊరేగించారు. అనంతరం స్థానిక రైవాడ కాలవలో విడిచిపెట్టారు. ఊరేగింపులో సేకరించిన అన్ని తీసుకుని సమీపంలోని సూది కొండ పైకి పంచామృతాలతో పాయసం వండి శిఖరం పైన పోశారు.
ఇదీ చూడండి: ఆ పథకం పేరును రైతు దగా పథకంగా మార్చండి: దేవినేని