ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గల మాచ్‌ఖండ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణమంతా... ఆత్మీయుల ఆలింగనాలూ, పలకరింపులతో పండగ వాతావరణం నెలకొంది. 1968లో స్థాపించిన ఈ పాఠశాలకు పూర్వవిద్యార్థులంతా కలసి స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం పరిధిలో ఉద్యోగుల పిల్లల కోసం మొట్టమొదట ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేశారు.
ప్రాజెక్టు పరిధిలో గల జోలాపుట్, ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్ ప్రాంతాలకు ఒకే ఒక్క పాఠశాల. దశాబ్దం వరకు ఇక్కడికి అనేక మంది వచ్చి చదువుకునేవారు. ఈ నెల 11,12 తేదీలలో పూర్వ విద్యార్థులంతా సామాజిక మాధ్యమాల ద్వారా ఏకమై పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు... చిన్ననాటి స్నేహితులను కలసి వారి మధుర జ్ఞాపకాలను మరో మారు గుర్తు చేసుకున్నారు.