విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలోనే అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారులను ఆదేశించారు. దేవస్థాన అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆయన లేఖ పంపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఆహార పొట్లాలను అందించాలని సూచించారు. దేవస్థానంలో భూముల లీజులు, లైసెన్సులు, అభివృద్ధి పనులు, మేజర్ కొనుగోళ్లు, టెండర్లపై తన దృష్టికి తీసుకురాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈవోను ఆదేశించారు. ఇదే లేఖను దేవదాయశాఖ కమిషనర్‌కు కూడా అశోక్ గజపతిరాజు పంపించారు.
ఇదీ చదవండీ.. CJI NV RAMANA: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీజేఐ