దిల్లీలో అల్లర్లను అదుపు చేయలేని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులను వ్యతిరేకించిన వారిని లక్ష్యంగా చేసుకుని భాజపా ప్రభుత్వం కక్షపూరితంగా ఈ దాడులకు పాల్పడిందని వామపక్ష నేతలు ఆరోపించారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అల్లర్లను అదుపు చేయాల్సిన పోలీసులు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చోద్యం చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. అమిత్ షా రాజీనామా చేయకపోతే రాష్ట్రపతి జోక్యం చేసుకొని అతనితో రాజీనామా చేయించాలని కోరారు.
ఇదీ చదవండి: విశాఖ ఘటనపై గవర్నర్‌ను కలుస్తాం: అశోక్‌బాబు