విశాఖలో న్యాయవాదులు తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధనకోసం నిరసన చేశారు. హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో హైకోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేయాలని... డెట్ రికవరీ అప్పీల్ ట్రిబ్యునల్ నూ కేటాయించాలని కోరారు. జిల్లా కోర్టు ప్రధాన మార్గం ముందు నిలిచి నినాదాలు చేశారు.