ETV Bharat / state

లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. తగ్గని పర్యాటకుల సందడి - lowest temperature in the state

విశాఖ మన్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం పది గంటలైనా పొగమంచు తెరలు వీడటం లేదు. అంత చలిలోనూ పర్యాటకుల సందడి మాత్రం తగ్గటం లేదు. ఆంధ్రా కాశ్మీర్​గా పిలువబడే లంబసింగిలో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

lambasingi
లంబసింగి
author img

By

Published : Dec 21, 2020, 4:41 PM IST

ప్రకృతి అందాల విశాఖ మ‌న్యంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అయినా... చలిమంటలు (క్యాంప్‌ ఫైర్‌) వేస్తూ, చల్లటి వాతావరణంలో వేడిని ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. విశాఖ మ‌న్యంలో చాలా ప్రాంతాల్లో ఉదయం పది వరకూ పొగమంచు తెరలు వీడక.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పొగమంచు సమయంలో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రవాణా, పోలీసు అధికారులు జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

రాష్ట్రంలోనే క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ న‌మోదు

ఆదివారం విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 5.3, చింతపల్లిలో 6.5 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కాశ్మీర్​గా పేరున్న లంబసింగిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. మబ్బులు భూమిని కమ్మేస్తున్నాయి. ఈ దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు ఏజెన్సీకి తరలి వస్తున్నారు. మరోవైపు.. సాయంత్రం నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాది నుంచి శీతల పవనాలు వీస్తున్న కారణంగా జిల్లాలో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

అరకు లోయ @ 40 వేల మంది పర్యటకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.