విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్‌లో.. రసూల్ డెకర్ పరిశ్రమలో మునగపాక మండల ఉమ్మలాడ గ్రామానికి చెందిన రాము ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాము మృతి చెందాడని ఆరోపించారు.
మృతుడి కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యలమంచిలి సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.
ఇదీచదవండి.