దక్షిణ, పశ్చిమ రీజియన్ కోరాపుట్ డీఐజీ(ఒడిశా పోలీస్) పండిట్ రాజేశ్.. ఆంధ్ర- ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. మాచ్‌ఖండ్ పర్యటనకు తొలిసారి వచ్చిన ఆయన పూర్తి విదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ నిర్మాణం అద్భుతంగా ఉందన్నారు. ఈ పర్యటనలో వించ్ ప్రయాణం వింత అనుభూతిని కలిగించిందన్నారు. ఆరు పదులు దాటినా.. నేటికి యంత్రాలు నేటికి చెక్కుచెదరకుండా సిబ్బంది నిర్వహణ బాగుందన్నారు.
అనంతరం ప్రాజెక్టు పరిధిలోని సమస్యల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమాచార వ్యవస్థ సరిగా లేక నానా అవస్థలు పడుతున్నామని అధికారులు డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీస్ ఉన్నతాధికారి పర్యటనకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయనతోపాటు బీఎస్‌ఎఫ్ 15 బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ విక్రమ్‌శర్మ పాల్గొన్నారు.
ఇదీ చదవండి..