ETV Bharat / state

Araku Valley : 15 నుంచి కిరండోల్‌ రైలు ప్రారంభం! - Araku Valley trains updates

అరకులోయకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ..రైల్వేశాఖ వారి కోసం ఓ నిర్ణయం తీసుకుంది. అరకులోయ అందాలను వీక్షించేలా.. ఆ ప్రాంతం మార్గంలో కిరండోల్‌ రైలు సేవలను మళ్లీ ప్రారంభించింది. ఇది 15వ తేదీనుంచి అందుబాటులోకి రానుంది.

Kirandol train to Araku Valley
కిరండోల్‌ రైలు ప్రారంభం
author img

By

Published : Jul 10, 2021, 10:46 AM IST

రైలు ప్రయాణంలో అరకులోయ అందాలను తిలకించాలని భావించే పర్యాటకులకు రైల్వేశాఖ తీపి కబురు అందించింది. విశాఖపట్నం-కిరండోల్‌ ప్రత్యేక రైలును ఈ నెల 15 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కరోనా తీవ్రత తగ్గిన అనంతరం ఇటీవలే ప్రారంభమైన ఈ రైలును రద్దీ లేని కారణంగా అధికారులు రద్దు చేశారు.

ప్రస్తుతం అరకులోయకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈనెల 15 నుంచి విశాఖపట్నం-కిరండోల్‌ (08516), 16 నుంచి కిరండోల్‌-విశాఖపట్నం (08515) ప్రత్యేక రైళ్లను తిరిగి పట్టాలెక్కిస్తున్నట్లు తూర్పుకోస్తా రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ఫేక్ కొవిడ్ రిపోర్ట్ కేసు: అఖిలప్రియ భర్త, సోదరుడి అరెస్ట్​కు ప్రత్యేక బృందాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.