Kidnappers Gang Arrest: విశాఖ జిల్లా పాడేరులో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 10 మంది సభ్యులు గల ముఠాను అరెస్టు చేసిన పాడేరు పోలీసులు.. వారి బారి నుంచి నలుగురు పిల్లలను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షలు, 3 వాహనాలు, 9 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 2న విశాఖ ఏజెన్సీ డుంబ్రిగూడ మండలంలో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వలస కూలీలు ఆరుబయట నిద్రిస్తుండగా వారి నుంచి మూడు నెలల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్ 18న అరకులోయలోనూ 8 నెలల చిన్నారి అపహరణకు గురి కావటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. జిల్లా పరిధిలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలోనూ కిడ్నాప్ కేసులు నమోదు కావటంతో పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు.
కిడ్నాప్‌లు జరిగిన తీరు, ప్రాథమిక సమాచారం మేరకు విశాఖ కేజీహెచ్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న నీలపు మని ప్రధాన ముద్దాయి అని తేలింది. మనీతో సహా..10 మంది ముఠాగా ఏర్పడి ఆరుబయట నిద్రిస్తున్న పిల్లలతో పాటు, యాచకుల పిల్లలను అపహరించి పిల్లలులేని వారికి విక్రయించాలని పథకం రచించారు. ఇప్పటి వరకు ఇలా నలుగురు పిల్లలను కిడ్నాప్ చేశారు. చాకచక్యంగా కేసును చేధించిన పోలీసులు ప్రధాన నిందితురాలు నీలపు మని, ఆమెకు సహకరించిన బాక్సింగ్ కోచ్ మహేశ్వరి, కొప్పుల క్రాంతి, కాపు సంపత్, రమేశ్‌తోపాటు మరో ఐదురుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి
Chit Fund Fraud in Guntur: చిట్టీల పేరుతో రూ.20 కోట్లు వసూలు చేసి..