విశాఖ జిల్లా రావితమకం కళ్యాణపులోవ జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. జలాశయం ఖరీఫ్ సీజన్ వరకు పూర్తిగా నీటిమట్టం అడుగుంటిపోయి రైతులకు ఉపయోగపడుకండా పోయింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రిజర్వాయర్లు కొత్త నీటితో కళకళలాడుతోంది. ఈ జలశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 458 అడుగుల వద్ద ఉంది. కొండ వాగుల నుంచి నీరు ప్రవహిస్తుండటంతో పూర్తి స్థాయికి చేరుకోవటం విశేషం..అదనపు నీటిని విడుదల చేసినపుడు రావితమకం, రోలుగుంట, మాకవరపాలెం లోతట్టు ప్రాంతాలను జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:రోజురోజుకు తగ్గిపోతున్న కుందు నది ప్రవాహం