శారదా నది ఉద్ధృతికి విశాఖ జిల్లా దేవరాపల్లి వద్దనున్న కాలిబాట వంతెన కొట్టుకుపోయింది. అనంతగిరి, హుకుంపేట, దేవరాపల్లికి చెందిన దాదాపు 100 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
రైవాడ జలాశయం గేట్లు ఎత్తి శారదా నదికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రవాహం పెరగడంతో వరద ఉద్ధృతికి వంతెన నామరూపాలు లేకుండా పోయింది. సంబంధిత సిబ్బంది తక్షణం స్పందించి.. పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: