ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ట్రైబ్యునల్ ఛైర్మన్ న్యాయమూర్తి హరనాథ్... శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వాదం, ప్రసాదాలను అందించారు. ఇటీవల ఆలయంలో జరిగిన అభివృద్ధిపై న్యాయమూర్తి హరినాథ్ ప్రశంసల జల్లు కురిపించారు.
విశాఖలో న్యాయమూర్తిగా పని చేసినప్పటి నుంచి తాను తరచూ స్వామివారిని దర్శించుకుంటున్నానని... కళ్యాణ మండపాన్ని ఇంత సుందరంగా ఎన్నడూ చూడలేదన్నారు. లక్ష్మీనారాయణ వ్రతం కోసం ప్రత్యేక మండపాన్ని మొదటిసారి చూస్తున్నానన్నారు. ఆలయంలో పరిశుభ్రత - పచ్చదనానికి ఈఓ సూర్యకళ పెద్దపీట వేశారని ప్రశంసించారు.
ఇదీ చదవండి: